దసరా సెలువులు 13 రోజులు
NEWS Aug 22,2025 07:44 am
పేరెంట్స్, పిల్లలకు తీపి కబురు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. విద్యా శాఖ సూచనల మేరకు ఈసారి 13 రోజుల పాటు దసరా పండుగ సందర్భంగా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఏపీలో కేవలం 9 రోజుల పాటు మాత్రమే సెలవులు ఇచ్చారు. వచ్చే నెల సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు ఉంటాయి. తిరిగి స్కూల్స్ , కాలేజీలు, యూనివర్శిటీలు, విద్యా సంస్థలన్నీ అక్టోబర్ 4న తెరుస్తారు.