రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా
NEWS Aug 21,2025 07:23 pm
ఏపీలో కూటమి సర్కార్ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు మాజీ మంత్రి బొత్స సత్య నారాయణ. పాలన గాడి తప్పిందని, చంద్రబాబు స్వంత ప్రచారం చేసుకోవడం తప్పా రాష్ట్రం గురించి పట్టించు కోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయం తప్ప రైతులకు రాష్ట్ర సర్కారు ఇచ్చిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో రేప్ ల సంఖ్య పెరుగు తోందన్నారు. పొద్దస్తమానం జగన్ రెడ్డిని తిట్టడంతోనే సరి పోతోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎందుకు నోరు విప్పడం లేదన్నారు.