ఘనంగా మరిడిమాంబ అమ్మవారి పండగ
NEWS Aug 21,2025 11:07 pm
బంగారుమెట్ట, ఎల్బీపురం అగ్రహారం గ్రామాలలో మరిడిమాంబ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. పసుపు కుంకుమ చీర జాకెట్ నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేల వేషాలు, తప్పిట గుళ్ళు, బాణాసంచా కాల్పులతో రెండు గ్రామాల భక్తులు ఉమ్మడిగా ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఇరు గ్రామాల పెద్దలు పాల్గొన్నారు.