2 మొరం JCB ల సీజ్
NEWS Aug 21,2025 09:19 pm
పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామంలోని ఏనా బోర్ల గుట్ట నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్నారన్న సమాచారం ఆధారంగా మైనింగ్ అధికారులు దాడి చేశారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోగానే మొరం తరలిస్తున్న వ్యక్తులు జెసిబిలను అక్కడే వదిలేసి పరారయ్యారు. తర్వాత విచారణ జరిపిన అధికారులు యజమానులను గుర్తించారు. అయితే, వారు JCBల్లో డీజిల్ లేదంటూ సాకులు చెప్పి 2 గంటల పాటు అధికారులను ఇబ్బంది పెట్టారు. చివరికి అధికారులు తంతాలు పక్కన పెట్టి 2 జెసిబిలను సీజ్ చేసి పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామ ప్రజలు మొరం మాఫియాకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. ఈ దాడిలో మైనింగ్ అధికారి ఆర్‌ఐ వెంకటగిరి పాల్గొన్నారు.