JANలో 'దేవర-2' షూట్.. ఆ తర్వాతే వేరే మూవీ!
NEWS Aug 21,2025 09:16 pm
'దేవర-2' సినిమా అటకెక్కిందని వస్తోన్న ప్రచారం ఫేక్ అని సినీవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు వెల్లడించాయి. అన్నీ కుదిరితే జనవరి నుంచి షూట్ మొదలు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారని, ఇది పూర్తయ్యాకే మిగతా సినిమాలపై దృష్టి పెడతారని చెప్పాయి. కాగా 'దేవర-2' 2027 సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.