వన్డే జట్టు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్..?
NEWS Aug 21,2025 09:11 am
దీర్ఘకాలం ప్లాన్ లో భాగంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వన్డే జట్టుకు స్కిప్పర్ గా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు నాయకుడిగా ఉన్న శ్రేయాస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. రోహిత్ శర్మకు లాంగ్ టర్మ్ ఆప్షన్‌గా అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడే భారత జట్టును ప్రకటించింది. అయితే అయ్యర్ కు ఛాన్స్ దక్కలేదు. దీంతో హెడ్ కోచ్ గంభీర్ , సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కాగా హిట్ మ్యాన్ వన్డే, టి20 ఫార్మాట్ కు రిటైర్ ప్రకటించాడు.