పెద్దపల్లి: సోలార్ పవర్ ప్లాంట్ సర్వే
NEWS Aug 21,2025 02:12 pm
పెద్దపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో సోలార్ పవర్ ప్లాంట్లపై విద్యుత్ అధికారులు సర్వే నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మేరకు సోలార్ పవర్ పాయింట్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న దానిపై అధికారులు పరిశీలనలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, లైన్ ఇన్స్పెక్టర్లు తదితరులు గ్రామాలను సందర్శించి సమాచారం సేకరించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుందని, పాఠశాలలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా లభిస్తుందని అధికారులు తెలిపారు.