అప్రమత్తంగా ఉన్నాం: తహసీల్దార్ ప్రసాద్
NEWS Aug 21,2025 01:34 pm
బూర్గంపాడు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రహదారులపైకి చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారని చెప్పారు. వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నాయకులు, స్థానికులు తగిన సహకారం అందించాలని తహసీల్దార్ కోరారు. అవసరమైన చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రజల భద్రత కోసం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.