తప్పుడు పత్రాలతో పోలీసు ఉద్యోగాలు
NEWS Aug 21,2025 04:51 am
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును బురిడీ కొట్టించి జాబ్స్ పొందిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 59 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు వీటిని సమర్పించినట్లు గుర్తించింది బోర్డు. తప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్లతో ఉద్యోగాల్లో చేరారని, 59 మంది నకిలీ పత్రాలపై సీసీఎస్లో ఫిర్యాదు చేసింది పోలీస్ శాఖ. ఇప్పటికే ఏఆర్, సివిల్ కానిస్టేబుల్స్గా ఉద్యోగం పొందిన వీరు వివిధ ప్రాంతాలలో జాబ్స్ చేస్తుండడం విస్తు పోయేలా చేసింది.