జియో వినియోగదారులకు బిగ్ షాక్
NEWS Aug 21,2025 09:42 am
వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రిలయన్స్ జియో. ఎంట్రీ లెవల్ రూ.249 ప్లాన్‌ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.ఈ ప్లాన్ కింద రోజుకు 1 జీబీ డాటాను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా డేటా వినిమయం భారీగా పెరిగిన నేపథ్యంలో తక్కువ డాటా ప్లాన్‌ను ఎత్తివేసి ఆ స్థానంలో రోజుకు 1.5 జీబీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కాగా ఇతర టెలికాం కంపెనీలు 28 రోజుల కాల పరమితితో రూ. 299 ప్లాన్ ను ఆఫర్ చేస్తున్నాయి.