ఆలయంలో తాగునీటి సమస్య
NEWS Aug 21,2025 09:24 pm
జూలపల్లి మండలం, పెద్దాపూర్ గ్రామంలోని యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద తాగునీటి సమస్య ఉంది. ఆలయం దగ్గర బోరింగ్ గత 3-4 నెలలుగా పనిచేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రావణమాసం సందర్భంగా రోజూ వందలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుంటున్నప్పటికీ, నీటి సౌకర్యం లేకపోవడం భక్తులను ఇరకాటంలో పడేస్తోంది. భక్తులు, గ్రామస్తులు పలుమార్లు ఎండోమెంట్స్ అధికారులకు సమస్యను తెలియజేసినా, ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామస్థులు ఆలయ బోరింగ్ తక్షణమే రిపేర్ చేయాలని, శుభ్రతా చర్యలు చేపట్టాలని ఎండోమెంట్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్యతో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.