ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
NEWS Aug 21,2025 11:06 pm
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మియాపూర్ పీఎస్ పరిధిలో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.