రామచంద్రపురం వద్ద రోడ్డు ఎక్కిన బుడ్డి వాగు వరద
NEWS Aug 21,2025 09:25 pm
అశ్వాపురం మండలంలోని రామచంద్రపురం గ్రామం వద్ద ఉన్న కడియాల బుడ్డి వాగు వద్ద గోదావరి రోడ్డెక్కింది. గురువారం ఉదయం నాటికి గోదావరి వరద ప్రవాహం పెరగడంతో రోడ్లపైకి గోదావరి వరద క్రమక్రమంగా చేరుతూ పెరుగుతూ ఉంది. రామచంద్రాపురం నుంచి మొండికుంట గ్రామం వైపు వాహనాల నిలిపివేతను నిలిపివేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.