భద్రాద్రి: దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద గోదావరి వరదనీరు ప్రధాన రహదారిపైకి భారీగా చేరుతోంది. దీంతో పలు రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గురువారం ఉదయం నాటికి నీటిమట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమై వరద ఉద్ధృతిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అధికారులకు సహకరించి, వరద ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.