నాగార్జున సాగర్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
NEWS Aug 21,2025 08:10 am
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 26 గేట్లు ఎత్తివేసి నీళ్లను దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 4,85,297 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 4,74,409 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 583.20 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీ లు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 292.2444 టీఎంసీలుగా ఉంది. నీళ్లు నిండు కోవడంతో ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.