సంక్రాంతి లోపు పేదలకు 2 లక్షల ఇళ్లు
NEWS Aug 21,2025 08:05 am
సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. బీపీఎల్ కుటుంబాలకు ఎన్టీఆర్ గృహ పథకం కింద సంక్రాంతి పండుగ నాటికి 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 10 లక్షల యూనిట్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. లబ్దిదారులు గృహ ప్రవేశం చేసేందుకు సిద్దంగా ఉండాలన్నారు. మిగతా ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎం.