బస్సులో ప్రయాణించిన మంత్రి సవిత
NEWS Aug 21,2025 07:27 am
మంత్రి సవిత విజయవాడ నుంచి అమరావతి వెళ్లే బస్సులో ప్రయాణం చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం గురించి ఆరా తీశారు. ఈ స్కీం వల్ల లక్షలాది మంది మహిళలకు మేలు జరిగిందన్నారు. మహిళల్లో ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగిందన్నారు. తమ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తల్లికి వందనం, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, ఇసుక వల్ల ఎంతో మేలు కలుగుతోందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.