నేడే దళపతి విజయ్ టీవీకే సభ
NEWS Aug 21,2025 06:39 am
ప్రముఖ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ రెండో సభ గురువారం మధురైలో జరగనుంది. ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. తమిళనాడు రాజకీయాలలో పెను సంచలనం సృష్టించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించాడు. తాను సినిమా రంగం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. అంతే కాకుండా పూర్తి సమయాన్ని తమిళనాడు ప్రజల కోసం కేటాయిస్తానని తెలిపాడు.