టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకు విరాళం
NEWS Aug 21,2025 05:33 am
బెంగళూరుకు చెందిన భక్తురాలు వినుత గణేష్ టిటిడి ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు రూ. 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. దాత దీనికి సంబంధించిన డిడిని తిరుమలలోని టిటిడి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరికి తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. విరాళం ఇచ్చిన భక్తురాలిని ప్రత్యేకంగా అభినందించారు ఏఈవో.