దెబ్బతిన్న రోడ్లపై మంత్రి ఆరా
NEWS Aug 21,2025 04:57 am
తెలంగాణలో దెబ్బతిన్న రోడ్లపై మంత్రి కోమటిరెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలకు కల్వర్టులు, బ్రిడ్జిలు, కోతకు గురైన రోడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తెగిన రోడ్లు, కల్వర్టుల వద్ద తాత్కాలిక పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి శాశ్వత ప్రతిపాదనలను రూపొందించాలని స్పష్టం చేశారు.