ఇన్నోవేషన్ హబ్స్ తో భారీగా జాబ్స్
NEWS Aug 21,2025 04:41 am
ఇన్నోవేషన్ హబ్స్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని అన్నారు మంత్రి నారా లోకేష్. మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటాయని, వాటిని గుర్తించి నేర్చుకుంటే ఉపాధికి ఢోకా లేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కు తోందన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నారు లోకేష్.