మెట్‌పల్లిలో ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం
NEWS Aug 20,2025 06:31 pm
మెట్‌పల్లి కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధునిక ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, ఫోటోగ్రాఫర్లు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు గంగారాజం, సభ్యులు ఆజార్, ఎస్పీ శ్రీధర్, మహేష్, ఇలియాస్, శ్రీనివాస్, నవీన్, సంతోష్, విజయ్, ప్రసాద్, దత్తు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ ప్రాధాన్యం, సమాజానికి ఫోటోగ్రాఫర్లు అందిస్తున్న సేవలను ప్రసంగకులు గుర్తుచేశారు.