దేశంలో రంగారెడ్డి నెంబర్ వన్
NEWS Aug 20,2025 03:47 pm
ఇండియాలో అత్యంత సంపన్న జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. గురుగ్రామ్, బెంగళూరును దాటేసింది. ఆ తర్వాతి స్థానాలను నోయిడా, దక్షిణ గోవా, సోలన్, దక్షిణ కన్నడ, ముంబై , సిక్కింలోని నాలుగు జిల్లాలు తలసరి ఆదాయంలో ముందంజలో కొనసాగుతున్నాయని తాజా నివేదిక వెల్లడించింది. ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, ఇన్నోవేషన్ హబ్, రియల్ ఎస్టేట్ రంగాలకు దగ్గరగా ఉంది రంగారెడ్డి జిల్లా.