సమ్మక్క సారలమ్మ జాతరకు రూ.150 కోట్లు
NEWS Aug 20,2025 03:11 pm
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది గిరిజన సంక్షేమ శాఖ. వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది మేడారం మహా జాతర. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినందుకు సీఎం, డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క.