లోక్సభలో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు
NEWS Aug 20,2025 03:07 pm
జమ్మూ కశ్మీర్ బిల్లు, రాజకీయ నేతల నేరాలపై కీలక బిల్లును ప్రవేశ పెట్టారు కేంద్ర మంత్రి అమిత్ షా. 30 రోజులు జైల్లో ఉంటే ప్రజా ప్రతినిధి పదవి రద్దయ్యేలా బిల్లును తయారు చేశారు. మరోవైపు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు ప్రతిపక్ష ఎంపీలు. ఈ బిల్లు రాజకీయ దుర్వినియోగానికి దారి తీసే అవకాశం ఉందని, దేశ సమాఖ్య విధానానికి బిల్లు విరుద్ధమన్నారు.