సీఎంకు పాదాభివందనం చేసిన ఐఏఎస్
శరత్‌కు రెడ్కో చైర్మన్ పదవి!
NEWS Aug 20,2025 02:58 pm
విశ్రాంత ఐఏఎస్ అధికారి శరత్‌కు రేవంత్ సర్కార్ కీలక పదవిని కట్టబెట్టింది. తెలంగాణ రెడ్కో చైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నాగర్ కర్నూలు బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐఏఎస్ శరత్ పాదాభివందనం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రస్తుతం శరత్ నియామకం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.