రాజీవ్ గాంధీకి గుర్రం మురళిగౌడ్ నివాళి
NEWS Aug 20,2025 02:26 pm
హైదరాబాద్: భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఎజీ కాలనీ చౌరస్తాలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి జూబ్లీహిల్స్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే గుర్రం మురళిగౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. వినోద్ కుమార్, మొహమ్మద్ గౌస్, చంద్రమౌళి, అరుణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకుని, దేశ నిర్మాణంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు.