భారీ వర్షం ముంబై అతలాకుతలం
NEWS Aug 20,2025 01:39 pm
భారీ వర్షాలకు ముంబైలో స్తంభించింది జనజీవనం. ముంబై సిటీ, ఠాణె, పాల్ఘర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలో 6 గంటల్లోనే రికార్డు స్థాయిలో 20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై రోడ్లపై భారీగా చేరిన ప్రవాహంలో చిక్కుకు పోయాయి బస్సులు, కార్లు, బైకులు. పట్టాలపైకి వరద నీరు చేరడంతో పలు రైళ్లను నిలిపి వేసింది సెంట్రల్ రైల్వే. 345 విమానాలు ఆలస్యంగా తిరుగుతుండగా 8 విమానాలు దారి మళ్లించారు.