మత్స్యకారులకు అధిక ప్రాధాన్యత
NEWS Aug 20,2025 12:08 pm
రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ది కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. ఇప్పటికే బడ్జెట్ లో అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు. ఆదరణ 3.0 పథకం అమలులో కూడా మత్స్యకారులకు ప్రాధాన్యం ఇస్తామని, ఆధునిక పరికరాలు అందజేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని తాము వచ్చాక పెంచడం జరిగిందన్నారు.