కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె
NEWS Aug 20,2025 12:01 pm
30 శాతం వేతనాలు పెంచాలని కోరుతూ టాలీవుడ్ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. సినీ నిర్మాతలతో సమావేశం అయ్యారు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు. నిన్న మూడు గంటలకు పైగా చర్చలు జరిపినా చర్చలు ఫలించలేదు. నిర్మాతలు పెట్టిన రెండు కండీషన్స్ వద్దే చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే కార్మికులకు పర్సంటేజ్ పెంచుతామని నిర్మాతలు ప్రకటించారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ యూనియన్స్ కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.