ఇండియా పాక్ యుద్దాన్ని నేనే ఆపాను
NEWS Aug 20,2025 11:27 am
మరోసారి నోరు పారేసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇండియా - పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని తానే ఆపానని అన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండేదన్నారు. లక్షలాది మందిని రక్షించానని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి స్వర్గానికి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇది ఆగి పోతే వారానికి 7 వేల మందిని కాపాడినట్లు అవుతుందన్నారు.