కోరుట్లలో పోలీసులపై దాడి
NEWS Aug 20,2025 10:33 am
కోరుట్ల పట్టణంలో మంగళవారం రాత్రి తాళ్ల చెరువు సమీపంలో కొందరు యువకుల మధ్య గొడవలు జరిగాయి. ఈ విషయంపై 100 నంబర్‌కు కాల్ అందడంతో, హెడ్ కానిస్టేబుల్ జావీద్, బ్లూ కోల్ట్ పిసి గంగాధర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గొడవను సద్దుమణిగించే క్రమంలో యువకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగడంతో హెడ్ కానిస్టేబుల్ జావీద్, పిసి గంగాధర్ గాయాలపాలయ్యారు. వారికి తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై సంబంధిత యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.