పులిచింతల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత
NEWS Aug 20,2025 09:56 am
పులిచింతల ప్రాజెక్ట్‌కు కొనసాగుతోంది వరద. ప్రాజెక్టు కళ కళ లాడుతోంది. అంతకంతకూ ఎగువ నుంచి నీరు వచ్చి చేరుతుండడంతో 14 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 4,13,381 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 4,13,712 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 166.53 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు తీర ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.