నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లు ఓపెన్
NEWS Aug 20,2025 09:48 am
పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. దీంతో 26 క్రస్ట్ గేట్లు ఓపెన్ చేశారు. 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 4,10,676 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 4,06,430 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు నీటి మట్టం 584 టీఎంసీలు కాగా నిల్వ సామర్థ్యం 294.550ల వద్ద ఆగింది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.