జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వండి - షర్మిల
NEWS Aug 20,2025 08:52 am
పార్టీలకు అతీతంగా ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కోరారు. ఎంపీలు ఆత్మ ప్రభోదానుసారం ఓటు వేయాలని కోరారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడం తెలుగు ప్రజలకు గర్వ కారణమని పేర్కొన్నారు. పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టీ న్యాయ నిపుణుడికి INDIA కూటమి అవకాశం ఇవ్వడం అభినందనీయమని అన్నారు.