జీహెచ్ఎంసీలో పలువురికి పోస్టింగ్స్
NEWS Aug 20,2025 08:27 am
అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు (AMC)గా పదోన్నతి పొందిన 19 మంది అధికారులకు GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు . వీరిని GHMC అంతటా వివిధ సర్కిల్‌లు, విభాగాలకు కేటాయించారు, ప్రస్తుత ఖాళీలను భర్తీ చేశారు. అధికారులను వెంటనే రిలీవ్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఏఎంసీలు ఆలస్యం చేయకుండా రిపోర్ట్ చేయాలని స్పష్టం చేశారు.