మందు ప్రియులకు ఖుష్ కబర్ చెప్పింది ఏపీ సర్కార్. ఈ మేరకు నూతన బార్ పాలసీని తీసుకు వచ్చింది. రాష్ట్రంలో 840 బార్లు ఉండగా వాటిలో 10 శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. 15 రోజుల్లోనే రెస్టారెంట్లు ఏర్పాటు చేసుకునే వీలు కల్పించామని తెలిపింది. లైసెన్స్ ఫీజులు 70 శాతం నుంచి 50 శాతానికి తగ్గించినట్లు వెల్లడించింది. అంతే కాకుండా బార్ల సమయాన్ని పొడిగించినట్లు స్పష్టం చేసింది.