శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తివేత
NEWS Aug 20,2025 08:00 am
భారీ వర్షాల తాకిడికి శ్రీశైలం జలాశయం కళ కళ లాడుతోంది. వరద ఉధృతి కొనసాగు తుండడంతో ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి వేసి దిగువకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 4,09,376, ఔట్‌ఫ్లో 4,11,237 క్యూసెక్కులు ఉండగా నీటి మట్టం 882.10 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా, పూర్తి స్తాయిలో నీరు చేరడంతో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.