సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వండి
NEWS Aug 20,2025 07:49 am
ఇండియా కూటమి తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన తెలుగు వాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి బేషరతుగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని కోరారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు విన్నవించారు. ఎన్డీఏ అభ్యర్థి పీఎస్ రాధాకృష్ణన్ కు మద్దతు ఇస్తే ఒరిగేది ఏమీ ఉండదన్నారు. సమాజ అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేసిన సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలన్నారు సీఎం.