ఘనంగా రాముల వారి బ్రహ్మోత్సవాలు
NEWS Aug 19,2025 06:24 pm
కథలాపూర్: స్థానిక శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఈ నెల 20, 21 తేదీలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల వారి దివ్యానుగ్రహం పొందాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామంలో స్వామివారి శోభాయాత్ర కన్నుల పండువగా నిర్వహించబడుతుందని తెలిపారు. అనంతరం, భజన కార్యక్రమాలు, కుంకుమ పూజలు మరియు అన్నపూజ వంటి ప్రత్యేక పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ అన్నసమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినట్లు, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.