బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రాచమడుగు
NEWS Aug 19,2025 11:49 pm
రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన రాచమడుగు వెంకటేశ్వరరావును కథలాపూర్ మండల బీజేపీ నాయకులు ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ— గత 30 ఏళ్లుగా పార్టీకి ఎనలేని సేవలు అందిస్తూ, పార్టీ బలోపేతం దిశగా అహర్నిశలు కృషి చేసిన వెంకటేశ్వరరావు సేవలు మరువలేనివని అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీ బండి సంజయ్, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయనకు ఈ పదవి దక్కడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ— స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించేలా నిరంతరం కృషి చేస్తానని, పార్టీ జెండా ఎగరవేయడం తన ధ్యేయమని స్పష్టం చేశారు.