కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై కేసీఆర్, హరీష్ పిటిషన్
NEWS Aug 19,2025 05:46 pm
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి హరీశ్ రావు. జస్టిస్ ఘోష్ నివేదికను సవాల్ చేశారు. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు మామా అల్లుడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఏది కావాలో కమిషన్ నివేదిక ఆ రకంగా ఉందంటూ ఆరోపించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలని విన్నవించారు.