జిల్లాస్థాయికి కోమటి కొండాపూర్ పాఠశాల గౌరవం
NEWS Aug 19,2025 11:47 pm
ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బోధనాభ్యాసన సామగ్రి (TLM) మేళాలో ఉపాధ్యాయులు ప్రతిభ కనబర్చారు. మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను ప్రతిబింబించే బోధన సామగ్రిని ప్రదర్శించారు. ఈ సందర్భంలో కోమటి కొండాపూర్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఎర్రోజు నర్మదా తెలుగు విభాగంలో ప్రదర్శించిన TLM విశేషమైన ఆకర్షణగా నిలిచి, అత్యుత్తమ TLMగా ఎంపికైంది. దీంతో ఆమె రూపొందించిన TLM, జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం వహించనుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి గర్వంగా తెలిపారు.