ఛాయా చిత్ర ప్రదర్శన సూపర్
NEWS Aug 19,2025 03:47 pm
వైజాగ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు కమిషనర్ కేతన్ గార్గ్. ఈ ఎగ్జిబిషన్ ఒకవైపు నగరాభివృద్ధికి సంబంధించిన ఫోటోలతో పాటు మరో వైపు పలు సమస్యలను ప్రతిబింబిస్తూ, ఇంకోవైపు అనేక విజయాలకు స్ఫూర్తిగా నిలిచింది అన్నారు. వచ్చే సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ ను తప్పకుండా ఏర్పాటు చేయాలని, జీవీఎంసీ తరఫున సహకారం అందిస్తామని ప్రకటించారు.