జగిత్యాల వాసి మృతదేహం లభ్యం
NEWS Aug 19,2025 08:33 am
జగిత్యాల: మహారాష్ట్రను ముంచెత్తిన భారీ వరదల్లో గల్లంతైన జగిత్యాల వాసుల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గల్లంతైన వారిలో ఒకరైన మహిళ మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి. పట్టణంలోని టిఆర్ నగర్‌కు చెందిన హసీనా బేగం కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో సంభవించిన వరదల్లో గల్లంతయ్యారు. అప్పటి నుంచి వీరి ఆచూకీ కోసం అధికారులు, సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. తాజాగా, హసీనా బేగం మృతదేహం లభ్యమైనట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.