ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి
NEWS Aug 19,2025 09:53 am
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేశారు. 1946, జూలై 8న పుట్టారు. సుదర్శన్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకులమైలారం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ పని చేశారు. 2007 నుండి 2011 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. కీలక తీర్పులు వెలువరించారు. ఎన్డీయే కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేశారు.