గీత దాటితే చర్యలు తప్పవు
NEWS Aug 19,2025 12:46 pm
టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు నియమ నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలతో దురుసుగా వ్యవహరించినా, అధికార దుర్వనియోగం చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. నాయకులు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రతి టీడీపీ ప్రజాప్రతినిధిని గమనిస్తున్నామని, తప్పు చేసిన వాళ్లు ఎంత పెద్దవారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు.