భట్టి, ఉత్తమ్ లపై క్రిమినల్ కేసులు కొట్టివేత
NEWS Aug 19,2025 10:15 am
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలపై నమోదైన క్రిమినల్ కేసులను హైకోర్టు కొట్టివేసింది. వీరిపై 2021లో ఆందోళనలు, నిరసనలు చేపట్టినందుకు కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించిన అభియోగాలు కొనసాగడానికి తగిన ఆధారాలు లేవని అందుకే కొట్టేస్తున్నట్లు తెలిపింది కోర్టు. ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేసిన ఇద్దరు నాయకులు రాజకీయ ప్రేరేపిత కేసుల నుండి ఉపశమనంగా ఈ తీర్పును స్వాగతించారు.