బలపడిన అల్ప పీడనం..జర భద్రం
NEWS Aug 19,2025 03:33 am
బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడింది అల్ప పీడనం. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా సమీపంలో గోపాలపూర్ వద్ద తీరం దాటింది. దీంతో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళ వద్దంటూ హెచ్చరించారు.