కబడ్డీ అసోసియేషన్ కు హైకోర్టు షాక్
NEWS Aug 19,2025 07:41 am
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అసోసియేషన్ జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్ పాటించడం లేదని పిల్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నోటీసులు జారీ చేసింది. పార్ట్ టైమ్ కోచ్‌లను తొలగించి పూర్తి స్థాయి ప్రముఖ క్రీడాకారులతో కోచ్‌లను నియమించాలని పిటిషనర్ కోరారు. నాలుగు వారాలకు వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది .